సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సహా టీఆర్‌ఎస్ నేతలందరికీ తమ్మినేని భయం పట్టుకుందని సీపీఎం ఎద్దేవా చేసింది. రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలోని వైఫల్యాల ను తమ పార్టీ ఎత్తిచూపుతుంటే మంత్రి హరీశ్‌రావు, ఆయన వందిమాగధులు ఎందుకు ఉలికిపడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.నాగయ్య, టి.జ్యోతి నిలదీశారు.
శనివారం ఎంబీ భవన్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. సీపీఎంపై, తమ పార్టీ నేత తమ్మినేని వీరభద్రంపై టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శల్ని ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ ఉద్యమకారులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిగినప్పుడు, చంద్రబాబు కేబినెట్‌లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ ఇంట్లోనే ఉండిపోయారన్నారు.