ట్యూషన్ ఫీజుకు అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణాల్లో రూ.7,500
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పిందని ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధు లు రమణారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల వైస్‌చాన్స్‌ల ర్లకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీ వ్ ఆర్ ఆచార్య ఆదేశాలు జారీ చేశారని వెల్లడిం చారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమ క్షంలో జరిగిన చర్చల అనంతరం పెంపునకు ఓకే చెప్పారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్యూషన్ ఫీజుపై అదనంగా రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో ట్యూషన్ ఫీజుపై అదనంగా రూ.7,500 విద్యార్థుల నుంచి వసూలు చేసుకు నేందుకు అంగీకరించారని వివరించారు.
అయితే ఆ మొత్తానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదని, తర్వాత సీఎంను కలసి రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని అడుగుతామని చెప్పారు. ఉస్మాని యా వర్సిటీ పరిధిలో గత ఏడాదే రూ.10 వేలు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినందున ప్రస్తుత పెంపు ఉస్మానియా పరిధి లోని కాలేజీలకు వర్తించదన్నారు. ఈ నేపథ్యం లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల బహిష్కరణ నిర్ణయా న్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సహకరిస్తామని తెలిపారు.
సీఎంతో చర్చించాక ఇంటర్ ఫీజుల పెంపుపై నిర్ణయం
ఇంటర్మీడియెట్ ఫీజుల పెంపుపై సీఎం కేసీఆర్‌తో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చినట్లు ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం తెలిపింది. శుక్రవారం సంఘం ప్రతినిధులు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు. ఇంటర్మీడియెట్ ఫీజుల పెంపుపై సోమేశ్‌కుమార్ కమిటీ నివేదిక ఇచ్చిందని, సీఎంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుం టామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
డిగ్రీ ఫీజులు పెంపు!
Published Sat, May 13 2017 12:40 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM