ఎవరినీ ఖాళీ చేయించవద్దు | Do not spare anyone | Sakshi
Sakshi News home page

ఎవరినీ ఖాళీ చేయించవద్దు

Published Wed, Jun 14 2017 1:37 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం సేకరిస్తున్న భూముల నుంచి ఎవరినీ ఖాళీ చేయించబోమని అడ్వొకేట్‌

సర్కారు సేకరిస్తున్న భూములపై హైకోర్టు స్పష్టీకరణ
 
సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం సేకరిస్తున్న భూముల నుంచి ఎవరినీ ఖాళీ చేయించబోమని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ మంగళవారం హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేస్తామని, అప్పటి వరకు ఏ ఒక్కరినీ ఖాళీ చేయించబోమని పేర్కొన్నారు.

ఏజీ మౌఖిక హామీని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement