యాసిడ్‌ పోస్తానన్నా స్పందించరా? | Do you react to acid attack on girl? | Sakshi
Sakshi News home page

యాసిడ్‌ పోస్తానన్నా స్పందించరా?

Published Fri, Sep 8 2017 9:08 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Do you react to acid attack on girl?

► బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేయని పోలీసులు 
బంజారాహిల్స్‌: ప్రేమ పేరుతో వెంట పడుతూ తనతో రాకపోతే యాసిడ్‌ పోస్తానని బెదిరించడంతో ఫిలింనగర్‌ రౌండ్‌టేబుల్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని మూడు రోజుల క్రితం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. దుర్గాభవానీనగర్‌ బస్తీకి చెందిన సంతోష్‌ అనే యువకుడు గత కొద్దిరోజులుగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఆటోలో ఆమెను వెంబడించి యాసిడ్‌ బాటిల్‌తో బెదిరించాడు.

దీంతో ఆందోళన చెందిన విద్యార్థిని తరగతి గదిలోకి వెళ్లి మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఇందుకు కారకుడైన సంతోష్‌ను పోలీసులు ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement