లక్ష టన్నులు - ఐదేళ్లలో ఈ- వ్యర్థాలు | e- waste going to be One lakh tonnes in the next five years | Sakshi
Sakshi News home page

లక్ష టన్నులు - ఐదేళ్లలో ఈ- వ్యర్థాలు

Published Thu, Jan 14 2016 7:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

e- waste going to be One lakh tonnes in the next five years

- కొండలా పేరుకు పోనున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు
హైదరాబాద్:

ఐటీ రంగంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మహానగరం.. అంతే మొత్తంలో ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే డ్రైనేజీ, కాలుష్యం, నీటి ఎద్దడితో సతమతమవుతున్న భాగ్యనగరికి ఈ-సమస్య గుదిబండలా మారింది. ఐటీ ఆధారిత పరిశ్రమలు, కంప్యూటర్లు, గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు భాగ్యనగరాన్ని ఈ-వేస్ట్‌కు అడ్డాగా మార్చేస్తున్నాయి.


 ఈ వ్యర్థాల ఉత్పత్తిలో దేశంలోనే ముంబై అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై తర్వాత ఐదో స్థానంలో మన మహానగరమే నిలవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 12.5 లక్షల టన్నుల ఈ-వేస్ట్ పోగవుతుండగా.. గ్రేటర్‌లో 45 వేల టన్నులు పేరుకుపోతోంది. ఇందులో సుమారు 55 శాతం పర్యావరణానికి హాని కలిగించేవి ఉన్నాయని, సాధారణ చెత్తతో పాటే వీటినీ పడేస్తుండడంతో అనర్థాలు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మరో ఐదేళ్లలో నగరంలో ఈ-వ్యర్థాలు ఏటా లక్ష టన్నులు పోగయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరంలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు విరివిగా వినియోగిస్తున్న ఇళ్ల నుంచి ఏటా సగటున 5 కిలోల ఈ-వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయని ‘గైడ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. సిటీలో టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లకు సంబంధించి ఏటా 12 వేల టన్నుల వ్యర్థాలు విడుదలవుతుండగా.. టెలిఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు.. తదితర ఈ-వ్యర్థాలు మరో 33 వేల టన్నులు ఉత్పత్తవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement