ఫ్యాషన్ అన్‌లిమిటెడ్
ఫిబ్రవరి మాసం పెళ్లిళ్ల సీజన్. ఫ్యాషన్‌లో అప్ టు డేటెడ్‌గా ఉండే హైదరాబాదీస్ ఈ పెళ్లిళ్ల సీజన్‌లో మరిన్ని డిజైన్స్ కోరుకుంటారు. అలాంటివారికోసమే తాజ్‌డెక్కన్‌లో జరుగుతున్న ఈ ఫ్యాషన్ ఎక్స్‌పో. దేశ నలుమూలల నుంచి వచ్చిన డిజైనర్లు రూపొందించిన నగలు, చీరలు, సంప్రదాయ దుస్తులు, గృహాలంకరణ వస్తువుల స్పెషల్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ‘ఫ్యాషన్ అన్‌లిమిటెడ్’ పేరుతో జరుగుతున్న ఈ ప్రదర్శన నిజంగానే సృజనాత్మకతకు హద్దులు లేవని నిరూపిస్తోంది. మంగళవారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నేడూ కొనసాగనుంది.