
వైఎస్ జగన్‌ను కలసిన బ్రాహ్మణ సమాఖ్య నేతలు
కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించేలా సర్కార్‌పై ఒత్తిడి తేవాలని విన్నపం
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌లోనైనా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కనీసం రూ.200 కోట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షు డు వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విజ్ఞప్తి చేసింది. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా ఆధ్వర్యంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి కోసూరు సతీష్ శర్మ, అర్చక పురోహిత విభాగం అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ, యువజన విభాగం అధ్యక్షుడు ఎం.ఎల్.ఎన్ సురేష్ (కార్పొరేటర్), సమాఖ్య ఉపాధ్యక్షుడు ఆర్.మధుసూదనశర్మ శనివారం జగన్‌ను ఆయన నివాసంలో కలసి తమ సమస్యలు వివరించారు.
దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో దాదాపు 13 వేలకు పైగా దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల కింద నెలకు రూ.2,500లు ఇచ్చేవారని, చంద్రబాబు సీఎం అయ్యాక ఆ మొత్తాన్ని రూ.5 వేలకు పెంచినట్లు ప్రకటించి.. దేవాలయాల సంఖ్యను 8 వేలకు తగ్గించారని జగన్ దృష్టికి తెచ్చారు. ఈ మొత్తం కూడా మూడు నెలలకో, ఆరు నెలల కో సారి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయిస్తామని బాబు హామీ ఇచ్చారని, కానీ మూడేళ్లుగా రూ.165 కోట్లే కేటాయిం చారన్నారు. వచ్చే బడ్జెట్‌లోనైనా కనీసం రూ.200 కోట్లు కేటాయించేలా ఒత్తిడి తీసుకు రావాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ విషయాన్ని తప్పకుండా అసెంబ్లీలో ప్రస్తావించి బ్రాహ్మణ కార్పొరేషన్‌కు తగినన్ని నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా, కడప మున్సిపల్ కార్పొరేటర్ పాకా సురేష్ కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కలిశారు.