డిగ్రీ ఫీజుల నిర్ణయంలో యూనివర్సిటీల ఇష్టారాజ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఒక్కో వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ఒక్కో రకంగా ఫీజు విధానం పట్ల విద్యార్థులు, యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కోర్సుకు ఉస్మానియాలో ఒక రకమైన ఫీజు, కాకతీయలో మరో రకమైన ఫీజు విధానం ఉంది. వర్సిటీలు నిర్ణయించిన ఫీజులు శాస్త్రీయంగా లేవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ఒకే రకమైన ఫీజుల విధానం అమల్లోకి తేవాలని యాజ మాన్యాలు కోరుతున్నాయి.
ఈ క్రమంలో ఏర్పడిన ఓయూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ బుధవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ సురేశ్‌కుమార్‌కు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. బీఎస్సీ ఎంపీసీఎస్‌కు రూ. 20వేలు, ఎంపీసీకి రూ.15 వేలు, ఎంఎస్‌సీఎస్‌కు రూ.20 వేలు, బీజెడ్‌సీకి రూ.20 వేలు... బీకాంలో కంప్యూటర్స్‌కు 20 వేలు, జనరల్‌కు రూ. 15 వేలుగా నిర్ణయించాలని కోరాయి.
ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన ఫీజులు
Published Thu, Jun 2 2016 3:38 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM
Advertisement
Advertisement