సికింద్రాబాద్‌లో మారుతీ కారులో మంటలు.. | Fire catches in Maruthi Shift car at Ganesh temple in Secuendrabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో మారుతీ కారులో మంటలు..

Published Sun, Oct 2 2016 10:41 PM | Last Updated on Sun, Apr 7 2019 3:28 PM

సికింద్రాబాద్‌లో మారుతీ కారులో మంటలు.. - Sakshi

సికింద్రాబాద్‌లో మారుతీ కారులో మంటలు..

గణేష్‌ టెంపుల్‌ ఫ్లైఓవర్‌పై మారుతీ స్విఫ్ట్‌ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌: మారుతీ స్విఫ్ట్‌ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన సికింద్రాబాద్‌ లోని గణేష్‌ టెంపుల్‌ ఫ్లైఓవర్‌పై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

విజయవాడ నుంచి యూసుఫ్‌గూడ వెళుతుండగా మారుతీ స్విఫ్ట్‌ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్‌ సహా, ప్రయాణికులంతా కారులో నుంచి దిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement