Maruthi Swift Car
-
యూట్యూబ్ చూసి.. దెబ్బకి సెలబ్రిటీ అయిపోయాడు!
యూట్యూబ్ వీడియోలనును ఖరీదైన అందులోనూ లాంబొర్గిని లాంటి విలాసవంతమైన స్పోర్ట్స్ కారును తయారుచేయడం సాధ్యమేనా? అంటే కృషి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు అసోంకు చెందిన ఒక మెకానిక్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..సాధనమ్మున పనులు సమకూరును ధరణిలోన అన్నట్టు తాను అనుకున్నది సాధించి తీరాడు..తన డ్రీం కార్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ కారుతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అస్సాంలోని కరీమ్గంజ్ జిల్లాలోని భంగా ప్రాంతానికి చెందిన మోటారు మెకానిక్ నూరుల్ హక్ (30 )ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టాడు. భంగా ఏరియాలో ఎన్ మారుతి కార్ కేర్ అనే గ్యారేజీ నిర్వహించే నూరుల్‌కు స్పోర్ట్స్ కార్లంటే మోజు. అందులోనూ లంబోర్ఝిని అంటే మరీ ప్రాణం. ఎలాగైనా అలాంటి కారును నడపాలని, సొంతం చేసుకోవాలని కలలుకన్నాడు. ఇంతలో కరోనా సంక్షోభం, లాక్డౌన్ ఇబ్బందులు వచ్చి పడ్డాయి. పని లేకుండా ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. తన డ్రీంకార్ తయారీపై దృష్టిపెట్టాడు.ఎట్టకేలకు తనకున్న తక్కువ వనరులోనే స్విఫ్ట్ కారు ఇంజీన్ మార్చి తన సొంత వెర్షన్నుతయారు చేయాలని నిర్ణయించు కున్నాడు. ఎట్టకేలకు తన పాత స్విఫ్ట్‌కారును ఇటాలియన్ లగ్జరీ కారు లగ్జరీ కారు లంబోర్ఘిని మోడల్లో తీర్చి దిద్దాడు. ఎనిమిది నెలలపాటు శ్రమించి తన ప్రాజెక్టును పూర్తి చేశాడు. దీని కోసం .రూ.6.2 లక్షలు ఖర్చు చేశానని నూరుల్ చెప్పాడు.అంతేకాదు తన నెక్ట్స్ టార్టెట్ కార్ లగ్జరీ స్పోర్ట్స్ కారు ఫెరారీ అని స్పష్టం చేశాడు. View this post on Instagram A post shared by Nurul Haque (@haquenurul786786) -
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
-
సిరివెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
కర్నూలు : సిరివెళ్ల వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతీ స్విఫ్ట్ కారు జేసీబీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం మధురపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో ప్రవీణ్ గౌడ్ (25), ప్రవీణ్ (26)లు అక్కడికక్కడే మృతిచెందగా..అర్జున్ రెడ్డి (26), చంద్ర మోహన్ (25)తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలే వీరు కొత్తగా మారుతీ మారుతీ స్విఫ్ట్ కారు కొన్నారు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం తిరుపతికి వెళ్లి వెంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కర్నూలు జిల్లా సిరివెళ్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సికింద్రాబాద్‌లో మారుతీ కారులో మంటలు..
హైదరాబాద్: మారుతీ స్విఫ్ట్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ ఫ్లైఓవర్‌పై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడ నుంచి యూసుఫ్‌గూడ వెళుతుండగా మారుతీ స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ సహా, ప్రయాణికులంతా కారులో నుంచి దిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.