బోడుప్పల్: హైదరాబాద్ నగరం బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో వ్యభిచారం జరుగుతున్న ఓ ఇంటిపై ఎస్‌వోటీ పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. అక్కడ వ్యభిచారం చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. మేడిపల్లి ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన కె.శంకర్(49) అనే వ్యక్తి కేశవనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
ఓ యువతి (20)ని తీసుకొచ్చి ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు స్థానికులు ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎస్టీవో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ యువతిని రిస్క్యూ హోంకు తరలించారు.
వ్యభిచార కేంద్రంపై దాడులు.. నలుగురి అరెస్ట్
Published Sun, Aug 9 2015 7:13 PM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM
Advertisement
Advertisement