four arrest
-
‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో నలుగురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64 కోట్ల నిధుల స్వాహా కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారికి సహకరించిన ఆరోపణలపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలి, ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆపరేషన్స్ మేనేజర్ వేదుల పద్మావతి, రిలేషన్షిప్ మేనేజర్ సయ్యద్ మొహియుద్దీన్లను హైదరాబాద్‌లో, చైర్మన్/ఎండీ బీవీవీఎన్ సత్యనారాయణరావును విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. పక్కా పథకంతో డిపాజిట్లు మాయం తెలుగు అకాడమీ తన నిధులను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసింది. ఈ లావా దేవీలను దళారులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులు నడిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి పేర్లు, వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పథకం ప్రకారం ఈ త్రయం ఎఫ్డీ చేసిన సమయంలోనే ఆ పత్రాలను కలర్ జిరాక్స్ తీసుకున్నారు. సంతోశ్‌నగర్, కార్వాన్‌ల్లోని యూబీఐ, చందానగర్ కెనరా బ్యాంక్ శాఖల్లోని 12 ఎఫ్‌డీలుగా ఉన్న రూ.64 కోట్లు కాజేయడానికి కుట్రపన్నారు. సిద్ధి అంబర్‌బజార్‌లోని ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌లో తెలుగు అకాడమీ పేరుతో ఖాతా తెరిచారు. ఆ సమయంలో నకిలీ గుర్తింపుకార్డులు, ఫోర్జరీ పత్రా లు సమర్పించారు. వాటి ఆధారంగా యూబీఐ కార్వాన్ బ్రాంచ్‌లోని రూ.43 కోట్లు, సంతోష్‌నగర్ బ్రాంచ్‌లో రూ.10 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.11 కోట్లు లిక్విడేట్ చేశారు. తర్వాత తెలుగు అకాడమీ పేరుతో సొసైటీలో తెరిచిన ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేసేశారు. సొసైటీకి 10 శాతం వరకు కమీషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి.. అకాడమీ ఆస్తులు, నిధులను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం ఏపీ, తెలంగాణ పంచుకోవాలని గత నెల 14వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వాటి లెక్కలు చూడాలని అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. అధికారులు ఈ నెల 18వ తేదీన బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి గడువు తీరిన, తీరని ఎఫ్డీలు రద్దు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే కుంభకోణం వెలుగుచూసింది. అయితే అప్పటికే ముగ్గురు సూత్రధారులూ తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి కోసం గాలిస్తున్నామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. -
దర్జాగా వచ్చి దోచేస్తారు
ఆకివీడు: కారులో తిరుగుతూ సినీఫక్కీలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను ఆకివీడు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆకివీడు ఎస్సై కె.సుధాకరరెడ్డి గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన బొజ్జగాని మురళి, చిన్నపోతుల కిరణ్‌కుమార్, మంత్రి నాగరాజు, తాడేపల్లికి చెందిన ఇట్టా బాలాజీ ముఠాగా ఏర్పడి జాతర్లు, ప్రారంభోత్సవాల వద్దకు కారులో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఆకివీడులో మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయ పునః ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుసుకుని గతనెల 24న ఇక్కడకు వచ్చి బస చేశారు. 25న ఉదయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వద్దకు వచ్చిన భక్తుల నుంచి రూ.9,300 నగదు, రెండు సెల్ఫోన్లు కాజేశారు. బాధితులు లబోదిబోమనడంతో ఆలయ నిర్వాహకులు మైక్‌లో జేబు దొంగలున్నారని ప్రచారం కూడా చేశారు. విషయం తెలిసిన ముఠా సభ్యులు చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. ఆకివీడు పెట్రోల్ బంకు వద్ద కాపు కాసిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. జాతర్లు, ప్రారంభోత్సవాలు, ఉత్సవాల సమాచారం తెలుసుకుని వీరు నలుగురు పక్కా ప్లాన్‌తో దొంగతనాలకు పాల్పడుతుం టారని ఎస్సై చెప్పారు. భీమవరానికి చెం దిన కల్లపల్లి లోవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. కారులో పరారవుతున్న నలుగురు నిందితులను పట్టుకుని విచారించి రెండు సెల్ఫోన్లు, రూ.8 వేల నగదు, నాలుగు రూ.2 వేల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చెప్పారు. కారును సీజ్‌చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచామన్నారు. కేసును ఛేదించడంలో ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు ప్రకాష్, రాజేష్, అప్సారీ, కానిస్టేబుళ్లు రఘు, రైటర్ జయరాజు, రమణ సహకరించారని ఎస్సై సుధాకరరెడ్డి పేర్కొన్నారు. నిందితుల్లో ఒకడైన ఇట్టా బాలాజీ గతంలో ఆరు కేసుల్లోనూ, బొజ్జగాని మురళీ పది కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వివరించారు. -
దండుపాళ్యం తరహా దారుణం
ములుగులో సంచలనం సృష్టించిన మస్రగాని వెంకటలక్ష్మి హత్య కేసు మిస్టరీ వీడింది. దండుపాళ్యం సినిమా తరహాలో దుండగులు పథకం ప్రకారం ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నగలు, డబ్బుల కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఘటన జరిగి నెల తిరగక ముందే అనుమానితుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. వరంగల్ , ములుగు: మండలంలోని జంగాలపల్లిలో జనవరి 19వ తేదీన జరిగిన మస్రగాని వెంకటలక్ష్మీ(65) హత్య మిస్టరీని ములుగు పోలీసులు ఛేదించారు. నిందితులను గురువారం సాయంత్రం ములుగు బస్టాండ్‌లో పట్టుకుని విచారించి కోర్టులో హాజ రుపరిచారు. డీఎస్పీ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ములుగు మండలం జంగాలపల్లికి చెందిన మస్రగాని రతన్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పెద్దలేపాక మండలం వల్లూరు చెందిన దండబోయిన రాజాతో గత కొనేళ్లుగా పరిచయం ఉంది. రాజా 12 ఏళ్లుగా స్థానికంగా వరికోత మిషన్లను నడపడానికి వెంకటలక్ష్మి కుమారుడు మస్రగాని విజయ్ ఇంట్లో ఉండేవాడు. ఈ క్రమంలో జంగాలపల్లికి చెందిన యువతిని రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాజా తీసుకొచ్చే వరికోత మిçషన్లను ఇదే గ్రామానికి చెందిన మస్రగాని రతన్ లీజు కు తీసుకొని నడిపేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. నగలు, నగదు కోసమే.. ప్రస్తుతం రాజా, రతన్‌లు ఎలాంటి పనిచేయకపోవడంతోపాటు తాగుడుకు బానిసయ్యారు. ఈ క్రమంలోనే ఇంటి పక్కనే ఉన్న వెంకటలక్ష్మీ వద్ద భారీగా బంగారు ఆభరణాలు, డబ్బులు ఉన్నాయని రాజాకు రతన్ వివరించాడు. దీంతో ఆ నగలు, నగదును ఎలాగైనా సొంతం చేసుకోవాలని పథకం పన్నారు. ఇద్దరు స్వయంగా వెళితే బాగుండదని రాజా తన స్వగ్రామం వల్లూరుకు చెందిన కార్పెంటర్ నవీన్‌కుమార్(21)ను సాయం కోరాడు. నవీన్ తన స్నేహితుడు మునీర్ భాషా(18)ను వెంట తీసుకొచ్చాడు. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రతన్ లాంగ్ట్రిప్పులకు వెళ్లేవాడు. ఇందులో భాగంగా గత నెల 17న తిరుపతికి వెళ్లాడు. ఈ క్రమంలోనే కడప నుంచి రతన్‌తోపాటు నవీన్‌కుమార్, మునీర్భాషాను ములుగుకు తీసుకొచ్చాడు. కాళ్లు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి హత్య.. వెంకటలక్ష్మీ మధ్యాహ్నం పూట ఒంటరిగా ఉందని తెలుసుకొని 1.30 నిమిషాల సమయంలో నవీన్‌కుమార్, మునీర్భాషా ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. మంచంపై ఒంటరిగా పడుకున్న వెంకటలక్ష్మిపై ఒక్కసారిగా దాడి చేశారు. నవీన్‌కుమార్ రెండు కాళ్లను గట్టిగా పట్టుకోగా మునీర్భాషా ముఖంపై దాడి చేయడంతో నోట్లో ఉన్న పంటి సెట్టు కిందపడింది. ఇదే సమయంలో ముఖంపై పిడిగుద్దులు గుద్ది, నోట్లో గుడ్డను కుక్కారు. ఆమె అరుపులు బయటికి రాకుండా తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టర్‌ను నోటితోపాటు కాళ్లు, చేతులకు బలంగా చుట్టారు. వృద్ధురాలు మృతిచెందిందని నిర్ధారించుకున్న తర్వాత ఒంటిపై ఉన్న 9 తులాల 15 గ్రాముల బంగారం, 20 తులాల వెండి కడియాలను బలవంతంగా తీసుకున్నారు. దీంతోపాటు ఇంట్లో ఉన్న బీరువాలో వెతికారు. దొంగిలించిన ఆభరణాలు తీసుకొని నేరుగా ములుగులో ఉన్న రాజా దగ్గరికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ములుగుకు వచ్చిన రతన్ ఆ ఆభరణాలను తీసుకొని ముగ్గురికి బస్సు చార్జీలకు డబ్బులు ఇచ్చి కడపకు పంపించాడు. నిందితులను పట్టించిన ఫోన్ కాల్ డాటా.. హత్య జరిగిన రోజు వచ్చిన ఫిర్యాదులు, ఇంటి పక్కన ఉన్న వారు చెప్పిన ఆధారాలనుబట్టి అనుమానితులుగా ఉన్న వారి ఫోన్నంబర్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో రాజా ఫోన్ మూడు రోజుల తర్వాత స్విచ్చాఫ్ కావడాన్ని గుర్తించారు. అనుమానితులుగా ఉన్న వారి ఫోన్ కాల్ డాటాను సేకరించారు. రతన్‌పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటికి వచ్చింది. దీంతో నిందితులుగా ఉన్న మిగతా ముగ్గురి కోసం సీఐ సాయిరమణ ఆధ్వర్యంలో హెడ్‌కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుళ్లు కిషన్, శ్రీనివాస్, ఛోటు కడపకు వెళ్లి గాలించారు. అయినా ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ములుగు బస్టాండ్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో సీఐ సాయిరమణ, ఎస్సై బండారి రాజు పాల్గొన్నారు. కాగా, కేసు మిస్టరీని ఛేదించిన సీఐ సాయిరమణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కేసులో ప్రధాన నిందితులు రతన్, రాజా వెంకట లక్ష్మీకి దూరపు బంధువులు కావడం గమనార్హం. -
ఆస్తి కోసమే తోడల్లుడిని హతమార్చారు
– నలుగురు నిందితుల అరెస్ట్ – సాంకేతిక ఆధారాలతో కేసును చేధించిన పోలీసులు నల్లమాడ (పుట్టపర్తి) : ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనే విషయం మరోసారి రుజువైంది. నల్లమాడ మండలం గోపేపల్లి పొలిమేరల్లోని ప్రధాన రహదారిపై గత నెల 29న ఓ వ్యక్తి మృతదేహం పడి ఉండగా పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కదిరి డీఎస్పీ వెంకట రామాంజనేయులు తెలిపారు. నల్లమాడ ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ గోపీతో కలసి నిందితులను మీడియా ముందు బుధవారం హాజరుపరిచారు. గుర్తు తెలియని మృతదేహం కదిరి మండలం బత్తలపల్లి తండాకు చెందిన రవికుమార్‌నాయక్(38)దిగా గుర్తించారు. తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానంతో విచారణ చేపట్టిన పోలీసులు హత్య కేసులో ప్రధాన నిందితుడు ముదిగుబ్బకు చెందిన ఇస్లావత్ తిరుపాల్ నాయక్, బాలరాజునాయక్, ఎస్.బాలాజీనాయక్, ఎన్.నాగేంద్రనాయక్‌ను అరెస్ట్ చేశారు. తిరుపాల్‌నాయక్, హత్యకు గురైన రవికుమార్‌నాయక్ తోడల్లుళ్లు. వీరిద్దరూ ఒకే ఇంటికి చెందిన అక్కా,చెల్లెళ్లను పెళ్లిళ్లు చేసుకున్నారు. వారి మామ ప్రభుత్వోద్యోగిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. హిందూపురం, అనంతపురం, ధర్మవరం, కదిరిలో అతని పేరుతో స్థలాలున్నాయి. తోడల్లుడిని అడ్డు తొలగించుకుంటే అత్తవారి ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని తిరుపాల్‌నాయక్ ఆలోచించాడు. వెంటనే రవికుమార్‌నాయక్ హత్యకు పథకం రచించాడు. తనకు పరిచయమున్న రమేష్‌నాయక్‌కు ఫోన్ చేసి రవికుమార్‌నాయక్‌ను ముదిగుబ్బకు పిలిపించుకున్నాడు. గత నెల 29వ రాత్రి ముదిగుబ్బ సమీపంలోని ఓ డాబాలో రవికుమార్‌నాయక్‌కు బాగా మద్యం తాపించాడు. ఆ తరువాత రమేష్‌ను అక్కడి నుంచి పంపించేశాడు. అనంతరం తిరుపాల్‌నాయక్ తన బంధువులు, స్నేహితులైన బాలరాజునాయక్, బాలాజీనాయక్, నాగేంద్రనాయక్‌తో కలసి రవికుమార్‌నాయక్‌ను కారు(నెంబర్. కేఏ 01ఎంహెచ్ 8240)లో ఎక్కించుకున్నారు. గోపేపల్లి పొలిమేర వద్దకు రాగానే మద్యం మత్తులో ఉన్న రవికుమార్‌నాయక్‌ను కారులో నుంచి బయటకు నెట్టేసి అతని శరీరంపై కారును వెనుకా, ముందుకు పలు దపాలు తొక్కించారు. చనిపోయాడనుకుని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం ప్రధాన నిందితుడు తిరుపాల్‌నాయక్ మృతుని భార్య,పిల్లలతో కలసి కదిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమకు ఎవరిపైనా అనుమానం లేదని, రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉండొచ్చని మృతుని కుటుంబ సభ్యులతో పోలీసులకు చెప్పించాడు. దీంతో పోలీసుల్లో అనుమానం మరింత బలపడింది. మృతదేహం వద్ద లభ్యమైన కారు మడ్‌గార్డ్ రేకు, కదిరి, ముదిగుబ్బలోని సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా వారు అసలు నిజాన్ని ఒప్పుకున్నారు. మలకవేమల–ముదిగుబ్బ రహదారిలో కల్వర్టు వద్ద బుధవారం నిందితులను అరెస్ట్ చేసి కదిరి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్ఐ సహా సిబ్బంది రాధాకృష్ణగౌడ్, హర్షవర్దన్‌రాజు, నారాయణస్వామి, రాము, శంకర్‌రెడ్డిని డీఎస్పీ అభినందించారు. కాగా ప్రధాన నిందితుడు తిరుపాల్‌నాయక్ మొదటి భార్య ముదిగుబ్బ మేజర్ పంచాయితీ సర్పంచ్ అని తెలిసింది. ప్రస్తుతం వీరు అధికార పార్టీలో కొనసాగుతున్నారు. భార్య ఉండగానే తిరుపాల్‌నాయక్ రెండో వివాహం చేసుకున్నాడు. -
గుప్తనిధుల కేసులో నలుగురు అరెస్ట్
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గం సమీపంలోని బీటీపీరోడ్డు పక్కన పొలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహానంది శుక్రవారం సాయంత్రం తెలిపారు. గురువారం మధ్యాహ్నం నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారించగా మొత్తం ఏడుగురికి ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. వీరిలో రాయదుర్గానికి చెందిన రమేష్‌నాయక్, బోయ రామదాస్, చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన పూజారి చంద్ర, చంద్రగిరికి చెందిన వెంకటేశులును శుక్రవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల్లో పట్టణానికి చెందిన ఎలక్ట్రానిక్ చానల్ విలేకరి మున్నా, అతని బంధువు జాఫర్, జావేద్ ఉన్నట్లు చెప్పారు. వీరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. -
అక్రమ ఆయుధాలు పట్టివేత : నలుగురి అరెస్ట్
సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఫసల్వాదిలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో 2 తుపాకులు, 2 కత్తులు, 3 బుల్లెట్లు లభ్యమయ్యాయి. వీటిని తరలిస్తోన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంపన్నులను బెదిరించి తేలికగా డబ్బుగా సంపాదించాలనే ప్రయత్నంలో భాగంగా వారు ఇక్కడ వచ్చినట్లు విచారణలో తేలింది. అరెస్టైన వారిలో ఒకరు స్థానికుడు కాగా.. మిగతా ముగ్గురు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్నతెలిపారు. -
తూరపాటి నాగరాజు కేసులో నిందితుల అరెస్ట్
-
కరీంనగర్లో మానవమృగాలు
► కరీంనగర్ జిల్లా వీణవంకలో దారుణం ► ఓ దళిత యువతిపై ముగ్గురు యువకుల అత్యాచారం.. ► పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ కోసం వస్తుండగా ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ ► ‘అన్నా దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నేను చచ్చిపోతా’నన్నా వదలని కీచకులు ► దుర్మార్గాన్ని సెల్ఫోన్లలో చిత్రీకరించిన కామాంధులు ► ఈ వీడియోలను ఇంటర్నెట్లో పెడతామని యువతికి బెదిరింపులు ► మళ్లీ వచ్చి కోరిక తీర్చాలంటూ వేధింపులు ►యువతి స్నేహితురాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు? ► విషయం తెలిసి యువకులను చితకబాది పోలీసులకు అప్పగించిన బంధువులు ► నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు వీణవంక: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కీచకులు ఓ దళిత యువతి (20)ని చెరబట్టారు.. ‘అన్నా... దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నన్ను వదిలిపెట్టండి.. లేకుంటే నేను చచ్చిపోతా..’ అని దీనంగా వేడుకున్నా వదలకుండా సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ పైశాచికత్వాన్ని సెల్ఫోన్లలో చిత్రీకరించారు. మళ్లీ మళ్లీ తమ కోరిక తీర్చాలంటూ వెంటపడ్డారు.. లేకుంటే ఆ దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు. ఈ వేధింపులు భరించలేని యువతి విషయూన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా... వారు పథకం ప్రకారం ఆ యువకులను గ్రామానికి రప్పించారు. పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో ఈ సంఘటన జరిగింది. ఆ యువకులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నవారు కావడం గమనార్హం. లైంగికదాడికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పోలీసు శిక్షణ శిబిరం నుంచి... వీణవంక మండల కేంద్రంలో స్థానిక పోలీసులు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని నెల రోజులుగా నిర్వహిస్తున్నారు. మండలంలోని చల్లూరుకు చెందిన ఓ దళిత యువతితోపాటు శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన గొట్టె శ్రీనివాస్ (23), కల్వల గ్రామానికి చెందిన ముద్దం రాకేశ్(19), ముద్దం అంజయ్య(20) అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. అతను మాయమాటలు చెప్పి యువతిని ఈనెల 10న మధ్యాహ్నం కోచింగ్ సెంటర్ నుంచి శంకరపట్నం మండలం కాచాపూర్ గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. రాకేశ్, అంజయ్యలకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించుకున్నాడు. ఆ గుట్ట వద్ద రెండేళ్ల కింద నడిచిన క్వారీకి సంబంధించిన ఓ రేకుల షెడ్డులోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 'అన్నా.. నన్ను వదిలిపెట్టండి.. మీ కాళ్లు మొక్కుతా.. నేను చచ్చిపోతా..’.. అని ప్రాధేయపడినా కనికరించలేదు. తర్వాత అంజయ్య, రాకేశ్ కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం యువతిని వీణవంక బస్టాండ్‌కు తీసుకొచ్చి వదిలిపెట్టారు. మరుసటి రోజు నుంచి యువతి కోచింగ్‌కు వెళ్లడం లేదు. అయినా ఆ ముగ్గురు కీచకులు... మళ్లీ తమ కామవాంఛ తీర్చాలంటూ యువతిని వేధించడం ప్రారంభించారు. లేకుంటే వీడియోలను ఇంటర్నెట్లో బెదిరించారు. దీంతో జరిగిన ఘటనను యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు ఈ నెల 24న రాత్రి 10 గంటల సమయంలో యువతితో ఆ యువకులకు ఫోన్ చేరుుంచి, చల్లూరుకు పిలిపించారు. వారినుంచి సెల్‌ఫోన్ తీసుకొని చూడగా... లైంగికదాడి దృశ్యాలు కనిపించడంతో ఆగ్రహంతో చితకబాది, పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాల పాలైన యువకులను పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారిపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు? నిందితుల్లో ఒకడైన శ్రీనివాస్ బాధిత యువతితోపాటు ఎల్బాక గ్రామానికి చెందిన ఆమె స్నేహితురాలి(20)ను సైతం తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా... ఆమె తప్పించుకుంది. శ్రీనివాస్ బలవంతంగా తన స్నేహితురాలిని తీసుకెళ్లాడని వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను చితకబాదిన మహిళలు ఎంజీఎం (వరంగల్): మహిళా సంఘాల ఆధ్వర్యంలో పలువురు మహిళలు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్సపొందుతున్న నిందితులను చితకబాదారు. అత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గులను కఠినంగా శిక్షించకుండా రాచమర్యాదలతో వైద్యం అందించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఫిర్యాదు ఇచ్చినా స్పందించకుండా బాధితులకు మరింత అన్యాయం చేస్తున్నారని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్ఎస్ ఆశాలత ఒక ప్రకటనలో మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు తీసుకోండి: ఈటల సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. దీనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని, ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యువతిపై ఆర్మీ జవాను అకృత్యం ఓదెల: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఆర్మీ జవాను తన స్వగ్రామానికి చెందిన ఓ యువతి (19)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరారయ్యాడు. ఐదు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మడక గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో మడక గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద నివాసముంటోంది. ఈనెల 23న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆర్మీ జవాను మల్లేశ్ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మల్లేశ్ పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే మల్లేశ్ అంతకుముందే ఈనెల 19న గ్రామంలోని ఇటుక బట్టీల వద్దకు వెళ్లి మహిళలపై దౌర్జన్యం చేసినట్లుగా కేసు నమోదైంది. ఈ రెండు కేసుల నుంచి నిందితుడిని తప్పించేందుకు గ్రామానికి చెందిన ఓ యువ నాయకుడు ప్రయత్నిస్తున్నాడని, అందువల్లే పోలీసులు ఈ ఘటనను కప్పిపుచ్చారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
'ఎర్ర' దొంగల ముఠా అరెస్ట్
బద్వేల్ అర్బన్ (వైఎస్సార్ జిల్లా): వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు కారులో ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి ఒక కారు, 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలం బ్రాహ్మణపల్లె నుంచి పీపీ కుంట వెళ్లే రహదారిలోని బెడుసుపల్లె క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి కారును వదిలేసి పరారయ్యేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. -
హత్య కేసులో నలుగురి అరెస్ట్
అల్లిపురం (విశాఖ) : గతంలో నమోదైన అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం విశాఖ నగరంలోని పోలీసు కమిషనరేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత నెల 9వ తేదీన మద్దివానిపాలెం గ్రామం సమీపంలో ఒక యువకుడు మృతి చెందగా, పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. యువకుడి హత్య జరిగినట్లుగా గుర్తించారు. ఈ హత్య కేసులో బబ్లూకుమార్, ఉమేష్, కిషోర్‌కుమార్, అమిత్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బబ్లూకుమార్ అనే వ్యక్తికి ఒడిశాకు చెందిన క్రిమెంట్ ఎక్క రూ. 30వేలు అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బు తిరిగి ఇవ్వాలని క్రిమెంట్ ఎక్క బబ్లూకుమార్ను నిలదీశాడు. దీంతో మిగిలిన ముగ్గురు స్నేహితుల సహాయంతో క్రిమెంట్ ఎక్క అడ్డు తొలగించుకున్నానని పోలీసులు విచారణలో బబ్లూకుమార్ ఒప్పుకున్నాడు. -
వ్యభిచార కేంద్రంపై దాడులు.. నలుగురి అరెస్ట్
బోడుప్పల్: హైదరాబాద్ నగరం బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో వ్యభిచారం జరుగుతున్న ఓ ఇంటిపై ఎస్వోటీ పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. అక్కడ వ్యభిచారం చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. మేడిపల్లి ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన కె.శంకర్(49) అనే వ్యక్తి కేశవనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఓ యువతి (20)ని తీసుకొచ్చి ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు స్థానికులు ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎస్టీవో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ యువతిని రిస్క్యూ హోంకు తరలించారు.