అల్లిపురం (విశాఖ) : గతంలో నమోదైన అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం విశాఖ నగరంలోని పోలీసు కమిషనరేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత నెల 9వ తేదీన మద్దివానిపాలెం గ్రామం సమీపంలో ఒక యువకుడు మృతి చెందగా, పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని కేసు నమోదు చేసుకున్నారు.
కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. యువకుడి హత్య జరిగినట్లుగా గుర్తించారు. ఈ హత్య కేసులో బబ్లూకుమార్, ఉమేష్, కిషోర్‌కుమార్, అమిత్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బబ్లూకుమార్ అనే వ్యక్తికి ఒడిశాకు చెందిన క్రిమెంట్ ఎక్క రూ. 30వేలు అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బు తిరిగి ఇవ్వాలని క్రిమెంట్ ఎక్క బబ్లూకుమార్‌ను నిలదీశాడు. దీంతో మిగిలిన ముగ్గురు స్నేహితుల సహాయంతో క్రిమెంట్ ఎక్క అడ్డు తొలగించుకున్నానని పోలీసులు విచారణలో బబ్లూకుమార్ ఒప్పుకున్నాడు.
హత్య కేసులో నలుగురి అరెస్ట్
Published Thu, Aug 13 2015 3:40 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement
Advertisement