సాక్షి, హైదరాబాద్: విద్యా ర్థులకు స్కాలర్‌షిప్‌లను మంజూరులో జాప్యంపై పీఏసీ చైర్‌పర్సన్ జె.గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఉపకార వేతనాల మంజూరులో జాప్యం పై ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) శుక్రవారం సమీక్షించింది. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆయా శాఖలు అనుసరిస్తున్న విధానంపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.
దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే తీసుకుంటున్నామని, కోర్సు, విద్యాసంస్థ, సామాజిక, ఆర్థిక అర్హతలన్నీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటేనే ఆన్‌లైన్‌లో నమోదవుతాయని అధికారులు వివరించారు. కాలేజీ, వర్సిటీల్లోని విద్యా ప్రమాణాలను బట్టి స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికారులు వెల్లడించారు. స్కాలర్‌షిప్‌ల మం జూరు, వాటిలో ఇబ్బందులపై చర్చించడానికి వీసీలతో భేటీ ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment