జీహెచ్‌ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు | GH MC's house tax inspector ACB attacks | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు

Published Wed, May 11 2016 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

జీహెచ్‌ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు

జీహెచ్‌ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు

మియాపూర్: జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌ఇన్‌స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కూకట్‌పల్లి సర్కిల్‌లో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న విజయ్‌కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు మంగళవారం మియాపూర్‌లోని మక్తామహబూబ్‌పేట్‌లోని అపార్ట్‌మెంట్, జేపీ నగర్‌లో ఉన్న ఇళ్లపై ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం వరకు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో సీఐలు మాజీద్ అలీఖాన్, గౌస్ ఆజాద్, అంజిరెడ్డి, మంజుల సోదాల్లో పాల్గొన్నారు. విజయ్‌కుమార్ గతంలో చందానగర్ సర్కిల్ 12లో పని చేశారు. అప్పట్లోనే ఆయన ఈ ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పటాన్‌చెరులో రెండు ఫ్లాట్స్,  నల్లగొండ జిల్లా భువనగిరి, యాదగిరిగుట్టలో 200 గజాల ప్లాటు, స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా జేపీనగర్‌లో తల్లి కమల పేరుతో ఒక ఇల్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారిం చారు. రూ.5 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రెండు కార్లు, లక్షా 47 వేల నగదు, 122 తులాల బంగారం, ఒక ద్వి చక్ర వాహనం ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్లు, కార్లను కోర్టులో డిపాజిట్ చేస్తామని ఏసీబీ డీఎస్పీ రవి కుమార్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement