ఉద్యాన పోస్టుల భర్తీకి సర్కారు నో
ఉద్యాన పోస్టుల భర్తీకి సర్కారు నో
Published Wed, Aug 2 2017 2:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
- 402 పోస్టుల భర్తీ ప్రతిపాదనలను తిరస్కరించిన ఆర్థికశాఖ
- వ్యవసాయశాఖ పంపిన ఫైల్ వెనక్కి
- పోస్టుల భర్తీ కోసం నెల రోజులుగా ఉద్యాన విద్యార్థుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఉద్యానాధికారుల పోస్టుల భర్తీకి సర్కారు అంగీకరించలేదు. 46 ఉద్యానా ధికారులు (హెచ్‌వో), 356 ఉద్యాన విస్తరణా ధికారుల (హెచ్‌ఈవో) పోస్టులను భర్తీ చేయా లని కోరుతూ వ్యవసాయ శాఖ గతనెల 25న పంపిన ఫైలును ఆర్థికశాఖ మంగళవారం తిర స్కరించినట్టు ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 402 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించగా.. అందులో 46 హెచ్‌వో పోస్టు లను కొత్తగా మంజూరు చేయాల్సి ఉంది. 356 హెచ్‌ఈవో పోస్టుల్లో 249 పోస్టులను కొత్తగా మంజూరు చేయాల్సి ఉండగా... మిగిలిన 107 పోస్టులను ఉద్యానశాఖలో పనిచేస్తున్న సబ్ అసిస్టెంట్ క్యాడర్‌కు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాల్సి ఉంది. ఇటీవల సీఎం అనుమతితోనే ఈ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించా మని, కానీ ఆర్థికశాఖ తిరస్కరించిందని అధికా రులు పేర్కొన్నారు. అత్యవసరమని భావిస్తే ప్రత్యేకంగా సీఎం కార్యాలయానికి విన్నవిం చాలని ఆర్థికశాఖ సూచించినట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో అర్థంగాక వ్యవసాయా ధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
విద్యార్థుల నిరసన మరింత తీవ్రతరం!
ఉద్యానశాఖలో పోస్టుల భర్తీ కోసం కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ విద్యార్థులు నెల రోజు లుగా సమ్మె చేస్తున్నారు. దీంతో వర్సిటీలో తరగతులకు బ్రేక్ పడింది. సమ్మె కారణంగా క్షేత్రస్థాయిలో జరగాల్సిన పరిశోధనలు నిలిచిపోయాయి. తరగతులను బహిష్కరించి సమ్మె చేస్తుండటంతో వర్సిటీ అధికారులు సెలవులు ప్రకటించారు. హాస్టల్‌ను, మెస్‌నూ మూసివేయడంతో విద్యార్థులే స్వయంగా వంట చేసుకుంటూ నిరసన కొనసాగిస్తున్నారు. హాస్టళ్లకు కరెంటు, నీటి సరఫరా నిలిపివేశారని విద్యార్థులు చెబుతున్నారు. వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టులను భర్తీ చేసినట్లుగానే ఉద్యానశాఖలోనూ మండలానికి ఇద్దరు హెచ్‌ఈవో, ఒక హెచ్‌వో పోస్టులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉద్యాన డిప్లొమా కోర్సులు పూర్తి చేసి ఇంతవరకు 900 మంది విద్యార్థులు బయటకు వచ్చారని చెబుతున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం హెచ్‌ఈవో పోస్టులను సృష్టించలేదని విమర్శిస్తున్నారు. హెచ్‌ఈవో పోస్టులపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేదాకా సమ్మె కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. తాజాగా పోస్టుల భర్తీని తిరస్కరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు మరింత ఆందో ళన వ్యక్తం చేసే అవకాశాలున్నాయి.
పోస్టుల తిరస్కరణతో కార్యకలాపాలకు అడ్డంకులు
ఉద్యానాభివృద్ధి సంస్థ కార్యక లాపాలు గతేడాది నుంచే ప్రారంభమ య్యాయి. మరోవైపు రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కూరగాయలు, పండ్లు తదితర ఉత్పత్తులను పండించాలని అందుకోసం పంట కాలనీలను ఏర్పాటు చేయాలని సీఎం వ్యవసాయ, ఉద్యానశాఖలను కోరారు. పోస్టుల తిరస్కరణతో ఈ కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడతా యని అధికారులు అంటున్నారు.
బోధన్ స్కాంలో ఇద్దరికి బెయిల్
నిజామాబాద్ లీగల్: బోధన్ వాణిజ్య పన్నుల కుంభకోణంలో మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం మొదటి అదనపు కోర్టు మేజిస్ట్రేట్ మేరి సారా దానమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. కాగా, రిమాండ్‌లో ఉన్న చివరి ఇద్దరికీ బెయిల్ మంజూరుతో ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 9 మంది నిందితులకు బెయిల్ వచ్చినట్లు అయ్యింది. ఏ8 నిందితుడు, రిటైర్డ్ సీటీవో నారాయణ దాస్ వెంకట కృష్ణమాచారి, ఏ–9 నిందితుడు డిప్యూటీ కమిషనర్ ధరణి శ్రీనివాస రావులకు మంగళవారం బెయిల్ వచ్చింది. వీరి రిమాండ్ 90 రోజులు పూర్తి అయిన నేపథ్యంలో మెజిస్ట్రేట్ రూ. 10 వేల చొప్పున రెండు పూచీ కత్తులతో బెయిల్ జారీ చేశారు.
Advertisement
Advertisement