- రాష్ట్రపతి పర్యటన,అసెంబ్లీ సమావేశాలపై చర్చ
- ఎర్రవెల్లి డబుల్ బెడ్రూం గృహ ప్రవేశాలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో సీఎం కె.చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. సోమవారం అసెంబ్లీ సమా వేశం ముగిసిన అనంత రం రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు గంటన్నర సేపు గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఈ నెల 22న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు, ఆ సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ గవర్నర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతున్న తీరు, నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
డిసెంబర్ 31 తర్వాత రాష్ట్రమంతటా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఉద్యమంలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు సులువుగా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా ఐటీ శాఖ తయారు చేస్తున్న టీఎస్ వ్యాలెట్‌పై చర్చించారు. వీటితో పాటు ఈ నెల 23న గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల గృహ ప్రవేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌ను ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రికను అందించారు.
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
Published Tue, Dec 20 2016 3:25 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
Advertisement