తెలంగాణలో గ్రూప్ -2 దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసిందని టీఎస్పిఎస్సీ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు.
హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్ -2 దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసిందని టీఎస్పిఎస్సీ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. గ్రూప్ - 2 లో మొత్తం 439 పోస్టులకు గాను 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ పరీక్ష ఏప్రిల్ 24, 25 తేదీలలో జరగనున్నాయని పేర్కొన్నారు.