సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్–2 పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థనపై 14వ తేదీలోగా నిర్ణయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్–2 పరీక్ష వాయిదా వినతులపై నిర్ణయం తీసుకుంటా మని రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తెలపడంతో ఈ మేరకు అనుమతినిచి్చ ంది. 150 మందే పిటిషన్ వేశారు.. మిగతా అభ్యర్థులంతా గ్రూప్–2 నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని కమిషన్ చెప్పడాన్ని తప్పుబట్టింది. లక్షల మంది కోర్టులో పిటిషన్ వేయలేరు కదా అని వ్యాఖ్యానించింది.
నిర్ణయం వెల్లడించడానికి మరింత సమయం కావాలని తొలుత టీఎస్‌పీఎస్సీ కోరగా న్యాయస్థానం నిరాకరించింది. లక్షల మంది ఎదురుచూసే అంశంలో జాప్యం కూడదని చెప్పింది. విచారణను సోమ వారానికి వాయిదా వేసింది. గ్రూప్–2 పరీక్షల ను వాయిదా వేయాలని కోరుతూ సీహెచ్ చంద్రశేఖర్‌తోపాటు 149 మంది హైకోర్టును ఆశ్ర యించారు. గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్.. తదితర 21 నియామక పరీక్షలు ఒకే నెలలో ఉన్న నేపథ్యంలో గ్రూప్–2 వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశా రు.
అభ్యర్థుల తరఫున న్యాయవాది బి.నర్సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మాధవీ దేవి శుక్రవారం విచారణ చేపట్టారు. సీనియర్ న్యాయవాది ఆలూరి గిరిధర్‌రావు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. ‘గ్రూప్–2.. ముఖ్యమైన పరీక్ష. సమర్థులనే తీసుకోవాల్సి ఉంది. దీని కోసం వారు పూర్తిగా సన్నద్ధం అయ్యేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశమివ్వాలి. హడావుడిగా పరీక్ష నిర్వహణ నియామక ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. అది అభ్యర్థులకు, ప్రభుత్వానికి మంచిది కాదు..’అని చెప్పారు.
ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేశాం..: టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ‘రాష్టవ్యాప్తంగా గ్రూప్–2 పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. 1,500కు పైగా పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసి, ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఆ రెండు రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కూడా ప్రకటించాం. ఇప్పుడు వాయిదా వేయాలని కోరడం సమంజసం కాదు. 14వ తేదీలోగా దీనిపై నిర్ణయం వెల్లడిస్తాం ..’అని నివేదించారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment