విద్యుత్ స్తంభా లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని కోరతామని, సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి చెప్పారు.
విద్యుత్ స్తంభాలకు జీఎస్టీ షాక్
Published Mon, Jul 10 2017 1:46 AM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM
18 నుంచి 28 శాతానికి పెరిగిన పన్నులు
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడంతో విద్యుత్ స్తంభాలపై పిడుగు పడింది. వ్యాట్ సహా ఇతర అన్ని రకాల పన్నులు కలిపి గతం లో విద్యుత్ స్తంభాలపై 18 శాతం పన్నులు ఉండేవి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ పన్ను 28 శాతానికి పెరిగింది. దీంతో విద్యుత్ సంస్థలపై 10 శాతం అదనపు పన్నుల భారం పడింది. దీంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు, రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)తో పాటు మున్సిపాలిటీలు, రియల్టర్లపై పన్ను భారం పడనుంది. దీంతో ఒక్క విద్యుత్ స్తంభాల కొనుగోళ్లపైనే డిస్కంలపై ఏటా రూ. 5 కోట్ల వరకు పన్ను భారం పడుతుందని అధికారుల అంచనా.

Advertisement
Advertisement