- రెండేళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్నవారందరూ అర్హులు
- ఉత్వర్వులిచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీలకు సోమవారం(జూన్ 20)తో గడువు ముగియగా, అదే రోజు ఆరోగ్యశాఖ బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈనెల 30 వరకూ బదిలీలకు గడువిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఒక చోట రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసిన వారందరూ బదిలీకి అర్హులేనని వెల్లడించారు.
ప్రతి విభాగంలో 20 శాతానికి మించి బదిలీలు చేయకూడదని, ఆన్‌లైన్‌లోనే బదిలీల ప్రక్రియ జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకేచోట ఎక్కువ కాలంగా పనిచేస్తున్న వారికి, ఐటీడీఏ(ఏజెన్సీ) ప్రాంతాల్లో వారికి, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి, మానసిక వికలాంగ పిల్లలున్న తల్లిదండ్రులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది.
ఆరోగ్యశాఖలో బదిలీలకు మార్గదర్శకాలు!
Published Tue, Jun 21 2016 2:23 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement