హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాను అనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అలాగే రాయలసీమ, కోస్తాలోనూ నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. ఆదివారం నాటికి ఇవి తెలంగాణలో కూడా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ చెప్పింది.