
ఏపీ పోలీసులకు ఇక్కడ పనేంటి?: మహేందర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లక తప్పదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. ఆయన తప్పు చేశారన్న విషయం ప్రజలు, కేంద్రానికి తెలుసని, అందుకే బాబు భయపడుతున్నారని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ కేసులోని అసలు విషయాలు దాచిపెట్టాలని ప్రయత్నిస్తూ, ఏపీ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ‘ఏపీ పోలీసులకు హైదరాబాద్‌లో ఏం పని ..? తెలంగాణలో ఏపీ పోలీసు స్టేషన్లు పెడితే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోర’ని చెప్పారు.