
నగరంలోని ఆర్మీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్ : నగరంలోని పలు ఆర్మీ ప్రాంతాల్లో భద్రతను ఉన్నతాధికారులు కట్టుదిట్టం చేశారు. కంటోన్మెంట్, ఏవోసీ గేట్ తదితర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్మీ పాసులున్న వారికి మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతి ఇస్తున్నారు. ఆర్మీ పాస్లు లేని వాహనాలు వేరే మార్గంలో వెళ్లాలని ఆర్మీ సిబ్బంది సూచిస్తున్నారు.
ఉడీ ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ పాక్ అక్రమిత కాశ్మీర్లోని పాక్ మిలిటెంట్ల స్థావరాలపై సునిసిన దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో ఆర్మీ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు.