కౌంటర్ దాఖలు చేయండి | High Court ask AP Govt for file affidavit on MLA Roja Petition | Sakshi
Sakshi News home page

కౌంటర్ దాఖలు చేయండి

Published Wed, Feb 17 2016 5:24 PM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

కౌంటర్ దాఖలు చేయండి - Sakshi

కౌంటర్ దాఖలు చేయండి

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. శాసనసభ కార్యదర్శి, ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.

శాసనసభ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీసుకున్న నిర్ణయంపై  హైకోర్టులో ఎమ్మెల్యే రోజా పిటిషన్ దాఖలు చేశారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని ఆమె పిటిషన్లో కోరారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని పేర్కొన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement