రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాలుగు రోజుల క్రితం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని పశువైద్య విద్యార్థులు దిగ్బంధించటంతో పోలీసులు లాఠీచార్జి చేసిన విషయం విదితమే. అయితే, ఈ సారి విద్యార్థులు మరో సమస్యపై ఆందోళనకు దిగారు. న్యూట్రిషన్ సైన్స్ కోర్సును విశ్వవిద్యాలయం ఎత్తివేయటంపై గురువారం మధ్యాహ్నం యూనివర్సిటీలో నిరసనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. కొందరిని అదుపులోకి తీసుకోవటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.