ముగిసిన జాతీయ పుస్తక ప్రదర్శన | hyderabad national book fair completed | Sakshi
Sakshi News home page

ముగిసిన జాతీయ పుస్తక ప్రదర్శన

Published Tue, Dec 27 2016 3:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ముగిసిన జాతీయ పుస్తక ప్రదర్శన - Sakshi

ముగిసిన జాతీయ పుస్తక ప్రదర్శన

ఆఖరి రోజు భారీగా తరలి వచ్చిన పుస్తక ప్రియులు

సాక్షి, హైదరాబాద్‌: కన్నుల పండువ గా 12 రోజులపాటు  సాగిన హైదరా బాద్‌ 30వ జాతీయ పుస్తక ప్రదర్శన ఆఖరి రోజు సోమవారం భారీగా తరలి వచ్చిన పుస్తకప్రియుల సమక్షం లో వేడుకగా ముగిసింది. ఈ ఏడాది నోట్ల రద్దు కారణంగా పుస్తక విక్రయా లు 40%వరకు తగ్గినట్లు ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు. సందర్శ కులు సైతం తగ్గారు. గతేడాది 12 లక్షల మంది సందర్శించగా.. ఈ ఏడాది 8 లక్షల మందే వచ్చారని నిర్వాహకులు చెప్పారు.  

జయహో పుస్తక దాతలు
మరోవైపు బుక్‌ ఫెయిర్‌ కమిటీ ఏర్పాటు చేసిన డోనర్స్‌ బాక్సులో అనేకమంది దాతలు వందల కొద్దీ పుస్తకాలను వేశారు. రచయిత్రి భానుమతి, రామారావు దంపతులు సోమవారం వందలాది పుస్తకాలను ఈ బాక్సులో వేశారు.

పుస్తకం గొప్ప సహచరి
బుక్‌ ఈజ్‌ బెస్ట్‌ కంపానియన్‌. కంప్యూటర్, ఇంటర్నెట్, సోషల్‌ మీడియా ప్రభావం నుంచి పిల్లలను బయట పడేసేందుకు ఈ ప్రదర్శనలు దోహదం చేస్తాయి.  – టి.అర్చన, జూబ్లీహిల్స్‌

పుస్తకం లేకుండా ఉండలేను
ప్రతిరోజు చదువుతాను. ఒక్క రోజు కూడా పుస్తకం లేకుండా ఉండలేను. ప్రతి సంవత్సరం వస్తాం. నచ్చినవి కొనుగోలు చేస్తాం.  – ఉమాగాయత్రి,  రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి

ఇది కోటి పుస్తకాల ఉత్సవం
ఇది కోటి పుస్తకాల మహో త్సవం. ఇందులో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒక్క పుస్తకం వందల మంది ఉపాధ్యాయులతో సమానం. పుస్తకం ఎంతో గొప్పగా ప్రబోధిస్తుంది.  – సుద్దాల అశోక్‌ తేజ, కవి, రచయిత, గాయకుడు

వంటల పుస్తకాలు కొన్నాను
నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే వంటలకు సంబంధించినవి నాలుగు బుక్స్‌ కొన్నాను.     – ఆదిత్య, 9వ తరగతి,  భారతీయ విద్యాభవన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement