నాకు హాని జరిగితే ఏపీ పోలీసులదే బాధ్యత
బంజారాహిల్స్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాజ్యాంగ హక్కులను కాపాడాలని పోరాడుతున్న తనకు ప్రాణహాని ఉందని తనకు ఏదైనా జరిగితే ఏపీ పోలీసులదే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లో విలేకరులతో మాట్లాడుతూ బీసీల సంక్షేమం, హక్కుల సాధనకు పోరాడుతున్న తనకు ముప్పు ఉందని, కొందరు దుండగులు తన కూతురిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.
దీనిపై కేంద్ర హోంసెక్రటరీ, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఏపీ సీఎం, డీజీపీలకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీల అమలు మర్చిపోయి ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రావణ రాజ్యం కొనసాగుతున్నదన్నారు. అరాచకాలు పెట్రేగిపోతున్నాయని హక్కులకు విలువ లేకుండా పోయిందన్నారు.