ఫతే మైదాన్ క్లబ్‌పై ఐటీ దాడులు
పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్పిడి చేసినట్లు నిర్ధారణ
రికార్డుల సీజ్, సమన్లు జారీ
హైదరాబాద్: నగరంలోని ఫతే మైదాన్ క్లబ్ (ఎఫ్‌ఎంసీ)పై ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) శాఖ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రద్దైన నోట్లను మార్పిడి చేసినట్లు తేలడంతో రికార్డులు సీజ్ చేసి, క్లబ్ యాజమాన్యానికి సమన్లు జారీ చేశారు. ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా క్లబ్‌లో సభ్యులు నోట్ల మాయాజాలం చేస్తుండటంతో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేపట్టారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు దాడులు కొనసాగారుు. రద్దైన నోట్లను మార్పిడి చేసేందుకు క్లబ్ యాజమాన్యం చేపట్టిన చర్యలు వారి మెడకే చుట్టుకున్నారుు. రూ.3.52 లక్షల మద్యం తాగినట్లు సృష్టించిన తతంగం ఐటీ అధికారుల దాడుల్లో బహిర్గతమైంది.
అంతేగాక ఈ నెల 8వ తేదీన రద్దు నోట్లను అంగీకరించినట్లు రికార్డులలో లెక్కలు చూపించారు. ఈ క్రమంలోనే ఈ నెల 11వ తేదీన ఇటీవల సభ్యత్వం పొందిన ముగ్గురు సభ్యులు రూ.3.62 లక్షల మద్యం సేవించినట్లు బిల్లులు నమోదు చేయడం బహిర్గతమైంది. ఇది కూడా రద్దు నోట్లను క్లబ్ అంగీకరించినట్లు రికార్డుల్లో చూపించడంతో ఐటీ అధికారులు నివ్వెర పోయారు. అంతేగాక క్లబ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు రూ.6 లక్షల సొంత డబ్బులను బ్యాంకులో వేసి మార్పిడి చేసినట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కొత్త సభ్యుల వద్ద డబ్బులు పెద్ద ఎత్తున తీసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు.
ఎకై ్సజ్ నిబంధనలు బేఖాతర్...
ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ చట్టానికి వ్యతిరేకంగా ఒకేరోజు రూ.3.50 లక్షల మద్యం విక్రరుుంచినట్లు రికార్డుల్లో చూపించారు. కాగా 2 ప్లస్ 1 స్కీమ్ నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేపట్టినట్లు రికార్డుల్లో చూపెట్టడంతో వారి గుట్టురటై్టంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్లబ్‌లోని సభ్యులందరికీ పంచాల్సి ఉంది. కానీ మేనేజింగ్ కమిటీ మాత్రమే పంచుకోవడంతో పాటు రూ.3.50 లక్షల పాత నోట్లను బ్యాంకులో జమ చేయడంతో వారి అక్రమాలు వెలుగులోకి వచ్చారుు. ఇక ఎకై ్సజ్ శాఖ క్లబ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఎదురు చూడాల్సి ఉంది. బ్యాంకులో మాత్రం పాత రూ.500, రూ.1,000 నోట్లను జమ చేస్తూ రోజూ వస్తున్న రూ.100, కొత్త కరెన్సీని కొంతమంది పంచుకోవడం గమనార్హం.
అవకతవకలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి
నిబంధనలకు వ్యతిరేకంగా అవకతవకలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎ. దినకర్‌బాబు, స్పోర్ట్స్ అండ్ యూత్ సెక్రెటరీ బి. వెంకటేశంలకు మంగళవారం పలువురు సీనియర్ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.