జెట్ ఎయిర్‌వేస్ ప్రేమికుల ఆఫర్
హైదరాబాద్ : ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ప్రయాణికుల కోసం జెట్‌ఎస్కేప్స్ పేరుతో పలు రకాల ట్రావెల్ ప్యాకేజీలను బుధవారం ప్రకటించింది. గోవా, జైపూర్, కేరళ, న్యూఢిల్లీ - ఆగ్రా, సాసాన్ గిర్ ప్రాంతాలకు సంబంధించిన ట్రావెల్ ప్యాకేజీలను ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి నెల మొత్తం అందుబాటులో ఉండనున్న ఈ ప్యాకేజీల ధర రూ.31,975 (జంటకి) నుంచి ప్రారంభమౌతుందని పేర్కొంది.