చక్రి మృతిపై అనుమానాస్పద కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద కేసుగా జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు. తన కొడుకు మరణంపై అనుమానాలున్నాయని ఆయన తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
తన కోడలు శ్రావణి వల్లనే చక్రి చనిపోయాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తన కొడుకును చంపుతున్నానంటూ రెండుసార్లు తనకు ఫోన్ కూడా చేసిందని, ఆ ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తే ఎన్నో వాస్తవాలు బయటకు వస్తాయంటూ ఆమె పేర్కొన్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.