డిమాండ్లకు ఓకే అంటే.. పేరు మారుస్తా
తెలుగు రాష్ట్రాల్లో టీజీ వెంకటేశ్, జీఎంఆర్, లలిత జువెలర్స్‌లతో పాటు అదాని, అంబాని, కిర్లోస్కర్, గోయెంకా తదితరులంతా వైశ్యులేనని, 46 శాతం దేశ ఆస్తి వైశ్య కమ్యూనిటీ చేతుల్లోనే ఉందన్నారు. వీరు బీజేపీకి ఇచ్చే డొనేషన్లలో 5శాతం పక్కన పెట్టి.. సోషల్ సెక్యూరిటీ ఫండ్‌ను ఏర్పాటుచేసి దళిత, ట్రైబల్ వెల్ఫేర్ కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని తెలిపారు. ఆర్యవైశ్య బడా కంపెనీల్లో 5 శాతం ఉద్యోగాలు ఆదివాసీలు, దళితులు, చాకలి, మంగలి వంటి 4 కులాల వారికి ఇస్తే పుస్తకాన్ని విత్ డ్రా చేసుకుంటానని స్పష్టం చేశారు.
అలాగే ఈ డిమాండ్‌లకు ఒప్పుకుంటే పుస్తకం పేరును ‘సామాజిక సర్వర్లు వైశ్యులు’అని మారుస్తానని ప్రకటించారు. తనను దేశద్రోహిగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపినా, అకాల మరణం వచ్చినా దానికి ఆర్యవైశ్యులే కారణమన్నారు. ఆర్యవైశ్య సత్రాల్లోకి అందరినీ అనుమతించాలని, లేకుంటే ప్రతి కులానికి సత్రం కట్టించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, మధు, సీపీఐ నేతలు రామకృష్ణ, చాడ వెంకట్‌రెడ్డిలతో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారని తెలిపారు.