'ప్రభుత్వ వ్యయంలో దుబారా తగ్గాలి'
హైదరాబాద్: ప్రభుత్వ వ్యయంలో దుబారా తగ్గాలని, వీలైతే పథకాల సంఖ్యను కుదించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. శనివారం సుదీర్ఘంగా జరుగుతున్న తెలంగాణ కేబినెట్ మీటింగ్లో మంత్రులు, అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అవసరమైతే పని తక్కువగా ఉన్నటువంటి శాఖల నుండి ఉద్యోగులను పని ఎక్కువగా ఉన్న శాఖలకు తరలించాలని సూచించారు.
రాష్ట్ర బడ్జెట్ జిల్లాల అవసరాలకు అనుగుణంగా ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం మంత్రులు తమ జిల్లాల్లో పర్యటిస్తూ వాస్తవ అవసరాలను తెలుసుకోవాలన్నారు. ఇకపై తాను కూడా తరుచుగా జిల్లాల్లో పర్యటించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం పెంచాలని ఆయన సూచించారు.