హైదరాబాద్ : భారతీయ జనతాపార్టీ శాసనసభా పక్ష నేతగా, ఆ పార్టీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన మండల నాయకుల రాష్ట్రస్థాయి సదస్సులో పార్టీ జాతీయ కార్యదర్శి రాంలాల్ ప్రకటించారు.
కిషన్ రెడ్డి నియామకానికి వేదికపైనున్న నేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. ఇప్పటివరకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా కొనసాగిన కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డిని శాసనసభా పక్షనేతగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసింది.