తెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు: కొప్పుల | koppuka eeshwar fired on ap cm and ys jaganmohan rddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు: కొప్పుల

Published Wed, May 18 2016 2:55 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

తెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు: కొప్పుల - Sakshi

తెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు: కొప్పుల

సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆంధ్రా ప్రాంత నేతలు ఎందరు అడ్డుపడినా తెలంగాణకు ఉన్న హక్కు మేరకు నీరు వినియోగించుకునేలా ప్రాజెక్టులు కట్టి తీరతామని మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తుండగా చంద్రబాబు, జగన్ మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునేందుకు కేంద్రానికి చంద్రబాబు అడ్డగోలు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement