'కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిపై కె.చంద్రశేఖరరావుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్వి దళిత వ్యతిరేక విధానాలని, దళితుల సమస్యలపై మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కోరినా ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణలో దళిత సంక్షేమ శాఖలు కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిలో చిక్కుకున్నాయని, వేతనాలు పెంచమన్నందుకు పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలు తొలగించారని మందకృష్ణ విమర్శించారు. దళిత పంపిణీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.