శివారుకు పవర్!
మేయర్‌ను నిర్ణయించనున్న శివారు ప్రాంతాలు
50 నుంచి 100కు పెరగనున్న డివిజన్లు
పునర్విభజనతో మారనున్న చిత్రం
{పసిద్ధ ప్రదేశాలకు ఇన్నాళ్లకు గుర్తింపు
కొత్త డివిజన్లలో కొన్ని... దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, బీఎన్‌రెడ్డినగర్, హస్తినాపురం, నాగోల్, గోల్కొండ, రాయదుర్గం, కొండాపూర్, ఎన్టీఆర్ నగర్
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శివారు ప్రాంతాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. మహా నగర మేయర్‌ను ఆ ప్రాంతాలే నిర్ణయించనున్నాయి. పునర్విభజనలో భాగంగా గ్రేటర్ శివార్లలో ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లు 100కు పెరగనున్నాయి. అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవే ముఖ్య భూమిక పోషించనున్నాయి. డిసెంబర్‌లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆలోగా వార్డుల (డివిజన్ల) డీలిమిటేషన్, రిజర్వేషన్ల తంతు ముగించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 200కు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీచేయడంతో అందుకనుగుణంగా అధికారులు ముసాయిదాను రూపొందించారు. వీటిల్లో స్వల్ప మార్పులకు వీలుంది. వారం రోజుల్లోగా ముసాయిదాను ప్రజల ముందుంచి, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నగరంలో ప్రసిద్ధి చెందిన దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, నాగోల్, బీఎన్‌రెడ్డి కాలనీ పేర్లతో జీహెచ్‌ఎంసీ డివిజన్లు లేవు. పునర్విభజనలో భాగంగా ఈ పేర్లతో కొత్త డివిజన్లు అవతరించనున్నాయి.
{పస్తుత ప్రతిపాదనల మేరకు గ్రేటర్ నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గంలో ఒక డివిజన్ తగ్గనుంది. మిగతా నియోజకవర్గాల్లో కొన్నింట్లో పెరుగుతుండగా... మరికొన్నింటిలో యధాతథంగా ఉండనున్నాయి. ‘సాక్షి’కి లభించిన వివరాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అవలోకిస్తే.. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాంటి మార్పుచేర్పులు లేవు. ప్రస్తుతమున్న ఏడు డివిజన్లు యధాతథంగా ఉంటాయి.ముషీరాబాద్ నియోజకవర్గంలోని 8 డివిజన్లు ఏడుకు తగ్గనున్నాయి. గాంధీనగర్ డివిజన్‌ను రద్దుచేసి దానిని కవాడిగూడ, దోమలగూడ, భోలక్‌పూర్ డివిజన్లలో కలపనున్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం 6 డివిజన్లు ఉండగా... అదనంగా ఒకటి పెరగనుంది. తార్నాక డివిజన్‌ను విభజించి కొత్తగా లాలాపేట పేరుతో ఏర్పాటు చేయనున్నారు.సనత్‌నగర్ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులూ లేవు.ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ డివిజన్ రెండుగా మారనుంది. దాంతో డివిజన్లు 6 నుంచి 7కు పెరగనున్నాయి.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుతమున్న 7 డివిజన్లు 9కి పెరగనున్నాయి. బోరబండ, రహ్మత్ నగర్ డివిజన్లకు అదనంగా బోరబండ-2, రహ్మత్‌నగర్-2 డివిజన్లు రానున్నాయి.
నాంపల్లిలో ప్రస్తుతం ఉన్న 8 డివిజన్లకు అదనంగా ఒకటి తోడవుతుంది.మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఎల్‌బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకంగా 6 డివిజన్లు పెరగనున్నాయి. అక్కడి డివిజన్ల సంఖ్య 8 నుంచి 14కు పెరగనుంది. ప్రస్తుతం ఉన్న వాటిలో పీఅండ్‌టీ కాలనీ రద్దు కానుంది. కొత్తగా దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం, నాగోల్ డివిజన్లు రానున్నాయి.ఉప్పల్ నియోజకవర్గంలో డివిజన్లు 7 నుంచి 12కు పెరగనున్నాయి. చిలుకానగర్ , ఇందిరానగర్‌లు కొత్తగా రాబోతున్నాయి.
మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో డివిజన్ల సంఖ్య 8 నుంచి 13కు పెరగనుంది. కొత్తగా సుభాష్‌నగర్, వెంకటాపురం ఆవిర్భవించబోతున్నాయి.కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డివిజన్లు 7 ను ంచి 11కు పెరుగుతున్నాయి. శ్రీరాంనగర్, రంగారెడి ్డనగర్‌ల పేరిట కొత్త డివిజన్లు వచ్చే వీలుంది.కూకట్‌పల్లిలో ప్రస్తుతం 6 డివిజన్లు ఉన్నాయి. ఇవి 10 లేదా 11కు పెరగనున్నాయి.హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని కార్వాన్ నియోజకవర్గంలో గోల్కొండ డివిజన్ కొత్తగా రానుంది. ప్రస్తుతం 6 డివిజన్లు ఉండగా.. మరో మూడు పెరగనున్నాయి.చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న 7 డివిజన్లలో ఉప్పుగూడ, బార్కాస్‌లు రెండేసి వంతున రూపాంతరం చెందనున్నాయి.
చార్మినార్‌లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు.బహదూర్‌పురా నియోజకవర్గంలో అసద్‌బాబా నగర్ పేరిట కొత్త డివిజన్ రానుంది. దీంతో డివిజన్లు 7 నుంచి 8కి పెరగనున్నాయి.యాకుత్‌పురాలో మాదన్నపేట, తలాబ్ చెంచలం రెండేసి డివిజన్లుగా మారనున్నాయి. అక్కడ వాటి సంఖ్య 7 నుంచి 9కి పెరగనున్నాయి.గోషా మహల్‌లోని 7, మలక్‌పేటలోని 8 డివిజన్లలో మార్పులు లేవు.మెదక్ లోక్‌సభ పరిధి పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆర్‌సీపురం, పటాన్‌చెరు డివిజన్లు రెండేసి వంతున విడివడబోతున్నాయి.
చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం 4 డివిజన్లు ఉండగా... ఇవి 7కు పెరగబోతున్నాయి. శివరాంపల్లి స్థానంలో శాస్త్రిపురం డివిజన్ రానుంది.ఐటీ రంగంతో ప్రసిద్ధి చెందిన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాయదుర్గం, కొండాపూర్, మియాపూర్ పేర్లతో కొత్త డివిజన్లు రానున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 6 డివిజన్లు ఉన్నాయి. ఇవి 14కు పెరగనున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుతం రెండు డివిజన్లు ఉండగా... అదనంగా ఎన్టీఆర్ నగర్ రానుంది.
దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, ఎల్‌బీనగర్.. నగరంలోని ప్రముఖ ప్రాంతాలు. గోల్కొండ ప్రశస్తి చెందిన పేరు. రాయదుర్గం, కొండాపూర్‌లు ఐటీ విస్తరణతో సంపన్న ప్రాంతాలుగా ఎదిగాయి. ఇంతప్రాముఖ్యత ఉన్న వీటి పేరిట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో డివిజన్లు/వార్డులు లేవు. త్వరలో జరగబోయే విభజనలో ఈ పేర్లతో డివిజన్లు ఆవిర్భవించబోతున్నాయి.