సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు స్పందించ లేదని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పలువురు మేధావులు, నేతలు రోహిత్ ఆత్మహత్యపై సంతాపం తెలుపుతుంటే... బాబు, ఏపీ మంత్రులు కిమ్మనక పోవడానికి కారణాలేమిటో దళితులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.