Nagarjuna meruga
-
దళితుల హక్కులు కాలరాస్తున్న సీఎం
వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తూ తప్పుడు లెక్కలతో మసిపూసి మారేడుకాయ చేస్తోందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత, గిరిజనులకు చెందాల్సిన నిధులు పచ్చచొక్కాలపరమవుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు జీవోలు, దొంగ లెక్కలు చూపిస్తూ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2015-16కుగానూ ప్రణాళిక వ్యయం రూ.38,671 కోట్లకు రివైజ్డ్ బడ్జెట్లో రూ.38,671 కోట్లు చూపించగా.. అందులో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రూ.6,613 కోట్లు రావాల్సి ఉంటే రూ.4,045 కోట్లిచ్చి రూ.2,568 కోట్లు ఎగ్గొట్టారన్నారు. ఎస్టీలకైతే రూ.2,601 కోట్లు రావాల్సి ఉండగా రూ.1,320 కోట్లు ఖర్చుచేసి రూ.740 కోట్లు ఎగ్గొట్టారన్నారు. దీన్ని బట్టి దళితులపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతోందన్నారు. -
బాబూ.. స్పందన లేదేం: మేరుగ
సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు స్పందించ లేదని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పలువురు మేధావులు, నేతలు రోహిత్ ఆత్మహత్యపై సంతాపం తెలుపుతుంటే... బాబు, ఏపీ మంత్రులు కిమ్మనక పోవడానికి కారణాలేమిటో దళితులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
నేతన్నలనూ మోసగించారు
చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత మేరుగ ధ్వజం ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? తక్షణమే చేనేత రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ హైదరాబాద్: ప్రతి అంశానికీ మసిపూసి మాయ చేస్తూ నిత్యం ప్రజలందర్నీ మోసగించే సీఎం చంద్రబాబునాయుడు చేనేత కుటుంబాలనూ అదేతీరున మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. అధికారంలోకి రాగానే నేతన్నలను ఆదుకుంటామని ఎన్నికలముందు వందలకొద్దీ హామీలిచ్చి, ఇప్పటివరకూ అందులో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా.. ‘చేనేత’ దినోత్సవం రోజున ప్రజలంతా చేనేత వస్త్రాలు వాడాలని పిలువునివ్వడం వారిని మోసం చేయడం కాదా? అని పార్టీ అధికార ప్రతినిధి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేనేతలను నిర్లక్షం చేసినందునే వందలమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారమూ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.312 కోట్ల చేనేతల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించి, ఆ ఫైలుపై సంతకం కూడా చేశారు. ఆయన మరణాంతరం సీఎంలైన వారెవరూ దాన్ని అమలు చేయనందున ఇప్పుడు చేనేతల అప్పు రూ.1000 కోట్లకు పెరిగిపోయింది. మొన్నటి ఎన్నికల ముందు కూడా చేనేత అప్పుల్ని అణాపైసలతోసహా మాఫీ చేస్తానని చంద్రబాబు మరోసారి వారిని మోసం చేశారు’’ అని ఆయన దుయ్యబట్టారు. ‘‘అధికారంలోకి రాగానే నేతన్నలకు గుర్తింపు కార్డులిస్తామన్నారు.. చేనేత భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇస్తామన్నారు.. జరీపై విధించిన వ్యాట్ రద్దు చేస్తామన్నారు.. కార్మికులకు బ్యాంకురుణాల మాఫీ.. పవర్‌లూమ్‌లపై ఉన్న రుణాలు రద్దు చేస్తామన్నారు.. ఒక్కొక్క నేత కుటుంబానికి లక్షన్నర సంస్థాగత రుణం ఇస్తామన్నారు.. ఇలా ఎన్నో హామీలిచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ ఎందుకు అమలు చేయలేదు?’’ అని ప్రశ్నించారు. తక్షణమే చేనేత రుణాల్ని అణాపైసలతో మాఫీచేయాలని, పేద, చేనేతల ఆత్మహత్యలను ఆపాలని నాగార్జున డిమాండ్ చేశారు.