మెట్రో పనులు ఆగలేదు: ఎన్వీఎస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నగరం లో మెట్రో ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగలేదని.. స్టేషన్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. మెట్రో పునాదులు, పిల్లర్ల నిర్మాణ పనులు పూరై్తనందున వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్లు, మెట్రో పట్టాలు, సిగ్నలింగ్ పనులు చేపడుతున్నామన్నారు. మెట్రో ప్రాజెక్టు లో 82 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు.
నాణ్యత విషయంలో రాజీ పడలేదని, అంత ర్జాతీయ ప్రమాణాల మేరకు మెట్రో పిల్లర్లు, స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ విధా నంలో అత్యాధునిక సాంకేతికతను నగర మెట్రో ప్రాజెక్టులో వినియోగిస్తున్నామన్నారు. వరదలు, భూకంపాలు, సునామీలు వంటి విపత్తులను సైతం సమర్థంగా ఎదుర్కొనే స్థాయిలో మెట్రో పునాదులు, పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.