
ఎన్టీఆర్ ఇంటి వద్ద హల్‌చల్ చేసిన దుండగుడి కోసం గాలింపు
రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.28లో సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద హల్‌చల్ చేసిన దుండగుడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.28లో సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద హల్‌చల్ చేసిన దుండగుడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీపావళి రోజున రాత్రి 10.30కి ఖరీదైన దుస్తులు ధరించి, నంబర్‌ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద బైక్ పార్క్ చేశాడు. వాచ్‌మన్ ఎవరు.. ఎవరు ? అని అరవడంతో ఎదురుగా ఉన్న ప్లాట్ నంబర్ 519-బి ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాడు.
ఎవ్వరు నువ్వని ప్రశ్నించిన ఆ ఇంటి వాచ్‌మన్ భార్య లక్ష్మిని గదిలోకి నెట్టి బయట గడియపెట్టాడు. అదే సమయంలో ఆ ఇంటి య జమాని బక్కుల సందీప్, ఆయన సతీమణి ప్రభ బాణసంచా కాల్చి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకోగా.. దుండగుడు ప్రధాన ద్వారం వద్ద నిలబడ్డాడు. సందీప్ దంపతులను తలుపు తీయాలని, లేకపోతే కాల్చేసానని తలుపు అద్దాల్లోంచి పిస్టల్ గురిపెట్టి బెదిరించాడు.
వారు తీయకపోవడంతో తలుపులు బద్దలుకొట్టేందకు ప్రయత్నించాడు. తలుపులు తెరుచుకోకపోవడంతో అక్కడినుంచి పారిపోయా డు. ఈ దృశ్యాలన్నీ ఎదురుగా ఉన్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సందీప్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.