
హెచ్‌సీయూ వద్ద ఎమ్మెల్యే అరెస్టు
హైదరాబాద్: విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) గేటు వద్ద కల్వకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి మంగళవారం రాత్రి నిరసన చేపట్టారు. కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ.. వైస్ చాన్స్‌లర్ అప్పారావు ఈరోజు బాధ్యతలు చేపట్టడంతో మళ్లీ రగిలింది.
వీసీ రాకను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో వర్సిటీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. నిరసనగా ఆయన గేటువద్ద బైఠాయించడంతో పోలీసులు వంశీచంద్‌ను అరెస్టు చేసి సమీపంలోని దర్గా పోలీసు స్టేషన్ కు తరలించారు.