ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హయాంలో శాసనసభ్యునిగా పని చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని కల్వకుర్తి ఎమ్మెల్యే (కాంగ్రెస్) చల్లా వంశీచంద్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హయాంలో శాసనసభ్యునిగా పని చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని కల్వకుర్తి ఎమ్మెల్యే (కాంగ్రెస్) చల్లా వంశీచంద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్ హయాంలో అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నం దుకు సిగ్గుపడుతున్నా’ అన్నారు.
ఎమ్మెల్యేగా ఉంటూ సీఎంను కలిసే అవకాశం లేదని, శాసనసభ్యులే సీఎంను కలువలేని పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని పోరాటాలు చేసినా కేసీఆర్‌లో చలనం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇందిరాపార్కువద్ద సోమవారం ఒకరోజు దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు.