సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నాలాల ఆక్రమణలతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండటంపై హైకోర్టులో గురువారం పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో కూల్చివేతలకు సంబంధించి లంచ్‌మోషన్ల రూపంలో అత్యవసర విచారణ నిమిత్తం 25కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై న్యా యమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు తమ నిర్మాణాలను కూ ల్చివేస్తున్నారని కొందరు పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. తమకు నోటీసులు ఇచ్చి కేవలం 24 గంటల గడువు మాత్రమే ఇచ్చారని మరికొందరు వివరించారు.
తమ సొంత స్థలాల్లో అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేసుకున్నామని, ఇందుకు అధికారులు కూడా అనుమతులు ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పు డు వాటిని అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కూల్చివేతల వ్యవహారంలో చట్ట నిబంధనలకు లోబడి నడుచుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల నిర్మాణాలను కూల్చకుండా స్టే ఉత్తర్వులు జారీ చేశారు.
కూల్చివేతలపై పెద్ద సంఖ్యలో పిటిషన్లు
Published Fri, Sep 30 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
Advertisement