సాక్షి,హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ టీడీపీ ఎంపీ సుధారాణి తనయుడు విజయ్‌రాజు పోలీసులకు పట్టుబడ్డాడు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నెం.36లో డ్రైవ్ నిర్వహించారు. ఈ సమయంలో మాదాపూర్ వైపు నుంచి కుటుంబంతో కలిసి విజయరాజ్ ఫార్చునర్ (ఎపి36 ఏక్యూ 0777) కారులో వస్తుండగా పోలీసులు ఆపారు. వాహనం నడుపుతున్న విజయరాజ్‌ను పరీక్షించగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు గుర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
డంకన్ డ్రైవ్‌లో చిక్కిన టీడీపీ ఎంపీ తనయుడు: విజయ్‌రాజు
Published Sun, Apr 20 2014 4:37 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement