దసరా రోజు అన్నీ కొత్తగా..: కేసీఆర్ | new districts and mandals have to function on the day of dasara, says kcr | Sakshi
Sakshi News home page

దసరా రోజు అన్నీ కొత్తగా..: కేసీఆర్

Published Tue, Sep 6 2016 4:12 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

దసరా రోజు అన్నీ కొత్తగా..: కేసీఆర్ - Sakshi

దసరా రోజు అన్నీ కొత్తగా..: కేసీఆర్

దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు అన్నీ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లా కలెక్టర్లతో ఆయన ఈ విషయమై సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని తెలిపారు. అధికారుల సర్దుబాట్లు, కొత్త ఉద్యోగుల నియామకాలు జరగాలని సూచించారు.

దసరా నాడు కొత్త జిల్లాలు ప్రారంభమైన తర్వాత.. మొదటి రోజు నుంచే రెవెన్యూ, పోలీసు శాఖలు ప్రారంభం కావాలని, మిగిలిన శాఖల కార్యాలయాలు, అధికారుల నియామకం ఆ తర్వాత చేపట్టాలని కేసీఆర్ చెప్పారు. జిల్లా కలెక్టర్లు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement