
చింపినా చిరగదు.. కాల్చినా కాలదు
రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులను ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది.
- నవంబర్ 1 నుంచి కొత్త రేషన్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులను ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. గతంలో మాదిరి లామినేషన్‌తో కూడిన కార్డును కాకుండా ఈ ఏడాది యూవిక్ పేపర్‌తో చేసిన కార్డును లబ్ధిదారులకు అందజేయనుంది. లామినేషన్ కార్డుతో పోలీస్తే దీని ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని, వినియోగం సైతం సులభమని పౌర సరఫరాల శాఖ చెబుతోంది.
పాతకార్డుల తయారీకి ఒక్కంటికీ రూ.14 మేర ఖర్చుకాగా, కొత్త కార్డు తయారీకి రూ.4 నుంచి రూ.5 మించదని అధికారులు చెబుతున్నారు. యూవిక్ పేపర్ చించినా చిరగదు. కాల్చినా కాలదు. నీటిలోనూ తడవదు. దీనిపై ఉన్న వివరాల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా సులభంగా చేసుకోవచ్చు. కేంద్ర ఆహార భద్రతాచట్టం, రాష్ట్ర పరిధిలోకి వచ్చే లబ్ధిదారులతోపాటు అంత్యోదమ కార్డులన్నీ గులాబీ రంగులోనే ఉండనున్నాయి. ఈ కార్డుల జారీకి ఇప్పటికే టెండర్లను సైతం శాఖాపరంగా పిలిచారు. ఈ ప్రక్రియంతా వచ్చే నెలాఖరులోగా పూర్తి చేసి నవంబర్ 1 నుంచి కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది.