
టీడీపీ నాయకుడిపై నిర్భయ కేసు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి, గాంధీనగర్ డివిజన్ జవహర్ నగర్కు చెందిన అమరం వినోద్పై చిక్కడపల్లి పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ఎన్ రాజు కథనం ప్రకారం...దోమలగూడ రిలయన్స్ అపార్ట్మెంట్లో నివసించే వివాహిత అయిన ఓ గాయకురాలుతో వినోద్కు ఫైనాన్స్ విషయంలో కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది.
అప్పటి నుంచి ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వినోద్ తనను లైంగికంగా వేధించడం, చంపుతానని బెదిరిస్తుండటంతో రెండు రోజుల క్రితం ఆమె చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం అతనిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.