ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించనున్న పాలీసెట్–2017 పరీక్షలో
నేడు పాలీసెట్–2017 రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించనున్న పాలీసెట్–2017 పరీక్షలో నిమిషం నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) చర్యలు చేపట్టింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించనుంది. 11 గంటల తరువాత విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించ బోమని స్పష్టం చేసింది.
పరీక్ష హాల్లోకి గంట ముందునుంచే అనుమతిస్తామని, ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్‌బీటీఈటీ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,31,044 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 393 కేంద్రాల్లో పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 52సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యార్థులు హెచ్‌బీ/2బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్, ఎగ్జామ్ ప్యాడ్, బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలని సూచించింది. సందేహాలకు హెల్ప్ డెస్క్ నంబర్ల (8499827774, 18005995577, polycetts@gmail.com)ను సంప్రదించవచ్చని పేర్కొంది.