ఏప్రిల్‌ 22న పాలీసెట్‌! | Paliset-2017 on April 22nd | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 22న పాలీసెట్‌!

Published Wed, Feb 22 2017 3:15 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

Paliset-2017 on April 22nd

వచ్చే వారంలో నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలీసెట్‌–2017ను ఏప్రిల్‌ 22వ తేదీన నిర్వహించేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చే వారంలో విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మాక్‌ పాలీసెట్‌ను కూడా నిర్వహించనుంది.

పాలీసెట్‌–2017 ప్రశ్నాపత్రం పాత పద్ధతిలోనే ఉంటుందని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి వెంకటేశ్వర్లు ఒక ప్రకటన లో తెలిపారు. మ్యాథ్స్‌కు 60 మార్కులు, ఫిజిక్స్‌కు 30 మార్కులు, కెమిస్ట్రీకి 30 మార్కులు మొత్తంగా 120 మార్కులతో కూడిన ప్రశ్నపత్రం ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement